ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GCC mayor: యథావిధిగా అమ్మ క్యాంటీన్లు

ABN, First Publish Date - 2022-11-30T07:19:22+05:30

అమ్మ క్యాంటీన్లు యథావిధిగా పనిచేస్తాయని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌ ప్రియ(Mayor Priya) స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో దివంగత మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జీసీసీ మేయర్‌ ప్రియ

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 29: అమ్మ క్యాంటీన్లు యథావిధిగా పనిచేస్తాయని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) మేయర్‌ ప్రియ(Mayor Priya) స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిరుపేదలు, వలస కార్మికులకు తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందజేసేందుకు వీలుగా అమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈ క్యాంటీన్ల నిర్వహణకు సక్రమంగా నిధులు కేటాయించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ ప్రియ అధ్యక్షతన మంగళవారం ఉదయం జీసీసీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్‌(Deputy Mayor Mahesh Kumar), కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ సహా అన్ని పార్టీల కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీఎంకే మిత్రపక్షాల కార్పొరేటర్లు మాట్లాడుతూ, అమ్మ క్యాంటీన్ల నిర్వహణ వల్ల కార్పొరేషన్‌ రూ.786 కోట్లు నష్టం వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి మేయర్‌ ప్రియ బదులిస్తూ పేదల కోసం ఏర్పాటుచేసిన అమ్మ క్యాంటీన్లు యఽథావిధిగా పనిచేస్తాయని, ఉపయోగంలో లేని క్యాంటీన్లు పరిశీలించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-11-30T07:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising