ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో వినాయక విగ్రహాలు

ABN, First Publish Date - 2022-08-20T06:18:01+05:30

కర్ణాటక రాష్ట్రంలో పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్‌


బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్‌ ప్రకటించారు. శుక్రవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల వేళ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసే సంపద్రాయం ఉందని పేర్కొన్నారు. వీటికి మినహా ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అనుమతులు లేవని అన్నారు. నమాజ్‌, ఈద్‌-మిలాద్‌ వంటి వాటికి అవకాశం ఇవ్వబోమని తెలిపారు. కాగా విద్యాశాఖ మంత్రి ఈవిషయం ప్రకటించిన వెంటనే.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ విద్యార్థి సంఘం క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు సయ్యద్‌ మియిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


గతంలో హిజాబ్‌కు అనుమతులు ఇచ్చేది లేదని, విద్యాసంస్థల ప్రాంగణంలో ఏ మతానికి చెందిన ఆనవాళ్లు ఉండరాదని చెప్పిన మంత్రి, ప్రస్తుతం వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఎలా అవకాశమిస్తారని ప్రశ్నించారు. విద్యారంగంలో శాంతికి భంగం కలిగించి, రాజకీయ లబ్ధి పొందాలని భావించడం సిగ్గుచేటని అన్నారు.  

Updated Date - 2022-08-20T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising