ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాయ్‌ నుంచి.. ట్రూకాలర్‌ తరహా యాప్‌

ABN, First Publish Date - 2022-05-22T07:27:38+05:30

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ సుపరిచితమే! దాని తరహాలోనే ఓ యాప్‌ తయారీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీవోటీ) ప్రతిపాదనలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీవోటీ నుంచి ప్రతిపాదనలు

త్వరలో యాప్‌ రూపకల్పన

స్వాగతించిన ట్రూకాలర్‌ సంస్థ


న్యూఢిల్లీ, మే 21: స్మార్ట్‌ఫోన్‌ యూజర్లందరికీ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ సుపరిచితమే! దాని తరహాలోనే ఓ యాప్‌ తయారీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీవోటీ) ప్రతిపాదనలు చేసింది. ఆ బాధ్యతలు నిర్వర్తించాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌)కి సూచనలు చేసింది. ‘‘త్వరలో యాప్‌ను రూపొందించే పనులను ప్రారంభిస్తాం. అన్ని టెలికాం సంస్థలు సిమ్‌కార్డు జారీ సమయంలో ఇచ్చే కేవైసీ ఆధారంగా మా యాప్‌ ద్వారా కాలర్‌ ఐడీ సేవలు అందిస్తాం’’ అని ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా పేర్కొన్నారు. అయితే.. ట్రూకాలర్‌ తరహాలో యాప్‌ను రూపొందించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశమని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ ట్రాయ్‌ నిర్ణయాన్ని ట్రూకాలర్‌ స్వాగతించింది. యాప్‌ను అభివృద్ధి చేయడంలో సాయం చేస్తామని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

Updated Date - 2022-05-22T07:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising