ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుతిన్‌తో షోల్జ్, మేక్రన్ తాజా చర్చలు : ఫ్రాన్స్

ABN, First Publish Date - 2022-03-12T23:08:12+05:30

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో జర్మన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో జర్మన్ చాన్సలర్ ఓలఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ తాజాగా చర్చలు జరుపుతున్నారని ఫ్రాన్స్ శనివారం తెలిపింది. షోల్జ్, మేక్రన్‌లతో పుతిన్ గురువారం టెలిఫోన్ ద్వారా మాట్లాడిన సంగతి తెలిసిందే. 


ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు ఆ దేశంతో చర్చలు జరపాలని పుతిన్‌ను షోల్జ్, మేక్రన్ కోరారని  క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ రష్యన్ వార్తా సంస్థలకు తెలిపారు. ఈ యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని వారు చెప్పినట్లు తెలిపారు. రష్యా తక్షణమే కాల్పులను విరమించాలని పుతిన్‌ను కోరినట్లు జర్మన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


ఇదిలావుండగా ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం శనివారం కూడా కొనసాగింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ దిశగా రష్యన్ దళాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇతర ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తోంది. మరియుపోల్ నౌకాశ్రయ నగరం రష్యన్ సేనల ముట్టడిలో ఉంది. 80 మంది ఆశ్రయం పొందుతున్న ఓ మసీదుపై బాంబులు పడినట్లు అధికారులు చెప్పారు. ఈ నగరంలో దాదాపు 1,500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. 


ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ కంపెనీ ఎనర్గోఆటమ్ చీఫ్ పెట్రో కోటిన్ మాట్లాడుతూ, రష్యన్ అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ రాస్ఆటమ్ ఆదేశాలను ఉక్రెయిన్ ప్లాంట్ అధికారులు పాటించాలని రష్యన్ అధికారులు ఆదేశించారని చెప్పారు. 


Updated Date - 2022-03-12T23:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising