ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noida: నిర్మాణంలో ఉన్న గోడ కూలి నలుగురు కూలీల మృతి, 9మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-09-20T17:58:02+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా(Noida) సెక్టారు 21 జలవాయువిహార్‌లో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా(Noida) సెక్టారు 21 జలవాయువిహార్‌లో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి (boundary wall collapse)నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన మంగళవారం జరిగింది. గోడ కూలిన ప్రాంతంలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. అగ్నిమాపకశాఖ జేసీబీ యంత్రాలను రంగంలోకి దించి శిథిలాలను తొలగిస్తున్నారు. నోయిడా అథారిటీ అధికారులు జలవాయు విహార్ వద్ద డ్రైనేజీ మరమ్మతు పనులు చేస్తుండగా గోడ కూలిందని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్(Noida District Magistrate Suhas) చెప్పారు. 


క్షతగాత్రులకు జిల్లా కేంద్ర ఆసుపత్రి, కైలాస్ ఆసుపత్రుల్లో చికిత్స చేపిస్తున్నామని సుహాస్ పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని మెజిస్ట్రేట్ చెప్పారు.మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయ పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


Updated Date - 2022-09-20T17:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising