ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former US President Donald Trump: నా ఇంటిపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు దాడి చేశారు...డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ

ABN, First Publish Date - 2022-08-09T14:07:00+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Former US President Donald Trump) తాజాగా సంచలన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Former US President Donald Trump) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడా నగరంలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌పై(Mar-a-Lago estate)(Florida home raided) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)(FBI) అధికారులు దాడి చేశారని ట్రంప్ ఆరోపించారు. ఫ్లోరిడాలోని తన ఇంటిపై(Florida home) దాడి చేసిన ఎఫ్‌బీఐ ఏజెంట్లు తన సేఫ్‌లోకి చొరబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఇంట్లో ఉన్న రికార్డులను శోధించేందుకు ఎఫ్‌బీఐ దాడి చేసినట్లు భావిస్తున్నారు.ఈ దాడిపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ డిపార్ట్‌మెంట్ నిరాకరించింది.ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడా క్లబ్‌కు తీసుకువచ్చిన పత్రాల పెట్టెలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని(several probes Trump) ఇద్దరు అధికారులు చెప్పారు.


తన ఎస్టేట్ ను ఎఫ్‌బీఐ ఆక్రమించుకుందని ట్రంప్ ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో ట్రంప్ ఎస్టేట్‌లో లేరని, ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఎఫ్‌బీఐ సెర్చ్ వారెంట్‌ని జారీ చేసిందని యూఎస్ అధికారులు చెప్పారు.2021 జనవరి నెలలో వైట్ హౌస్ నుంచి ట్రంప్ బయటకు వచ్చినప్పటి నుంచి పామ్ బీచ్‌లోని తన క్లబ్‌ను ఇంటిగా మార్చుకున్నారు.ఫ్లోరిడా ఎస్టేట్‌కు సంబంధించిన రికార్డులను ట్రంప్ తొలగించడంపై జస్టిస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ట్రంప్ కు చెందిన ఫ్లోరిడా ఇంటి నుంచి 15 బాక్స్‌ల వైట్ హౌస్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


Updated Date - 2022-08-09T14:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising