ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mulayam Singh Yadav: మరింత విషమించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..

ABN, First Publish Date - 2022-10-02T23:16:41+05:30

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనారోగ్యం బారిన పడిన ఆయనను కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆదివారం నాడు ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూ వార్డుకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు సుషీలా కటారియా ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది.



ములాయం సింగ్ యాదవ్ వయసు 82 సంవత్సరాలు. మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా సేవలందించారు. కొన్ని వారాలుగా ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా బారిన పడటంతో ములాయం సింగ్‌ను అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయి. రెండో భార్య మరణం కూడా ఆయనను మరింత కుంగదీసింది. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు కొంత కాలంగా ములాయం దూరంగానే ఉన్నారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవే అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.

Updated Date - 2022-10-02T23:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising