ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Snooping case : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ అరెస్ట్

ABN, First Publish Date - 2022-07-14T23:14:02+05:30

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) గురువారం అరెస్ట్ చేసి, ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచింది. కోర్టు ఆమెను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. 


చిత్ర రామకృష్ణ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ అధిపతి రవి నారాయణ్‌లపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసును నమోదు చేసింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ (Central Bureau of Investigation), ఈడీ దృష్టిలో ఓ సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సంజయ్ పాండేకు సంబంధించిన సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టుపైనా, కొందరిపై అక్రమంగా నిఘా పెట్టడంపైనా దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ దృష్టిలోకి ఈ జర్నలిస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. సంజయ్ పాండే చట్టవ్యతిరేకంగా కొందరిపై నిఘా పెట్టినట్లు సాక్ష్యాధారాలు లభించాయని సమాచారం. 


పాండే మద్దతుగల iSec Services Pvt Ltdకు చెల్లించిన సొమ్ముకు సంబంధించిన రశీదులు, రికార్డింగ్స్ వాయిస్ శాంపిల్స్, రికార్డింగ్స్ ఒరిజినల్ ట్రాన్‌స్క్రిప్ట్స్, సర్వర్లు, రెండు ల్యాప్‌టాప్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఎంటీఎన్ఎల్ లైన్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా సాక్ష్యాధారాలు లభించాయి. 


Updated Date - 2022-07-14T23:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising