ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eshwarappa: మంత్రి పదవి లేక అసంతృప్తిగా ఉంది..

ABN, First Publish Date - 2022-09-17T17:47:36+05:30

కాంట్రాక్టర్‌ ఆరోపణల వివాదంలో క్లీన్‌చిట్‌ లభించినా మంత్రి హోదా దక్కలేదనే అంశంపై అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్‌ ఆరోపణల వివాదంలో క్లీన్‌చిట్‌ లభించినా మంత్రి హోదా దక్కలేదనే అంశంపై అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ఈశ్వరప్ప(Eshwarappa) పేర్కొన్నారు. శుక్రవారం మైసూరు చాముండేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. కొందరు నేత లు రాజీనామా అవసరం లేదని సూచించారని తెలిపారు. పార్టీకి తన వల్ల చెడ్డపేరు రాకూడదనే రాజీనామా చేశానన్నారు. వివాదంపై క్లీన్‌చిట్‌ లభించిన వెంటనే మంత్రి అవుతాననే విశ్వాసం ఉండేదన్నారు. రోజులు గడుస్తున్నా అవకాశం ఇవ్వకపోవడం మరింత అసంతృప్తి కలుగుతోందన్నారు. తాను పార్టీలో క్రమశిక్షణ కల్గిన కార్యకర్తనని, పార్టీ తనకు అన్ని విధాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. అసంతృప్తి ఉన్నందునే కొన్ని రోజులపాటు శాసనసభ సమావేశాలకు వెళ్లలేదన్నారు. సోమవారం నుంచి పాల్గొంటానని తెలిపారు. భారత్‌ జోడో యాత్ర, శాసనసభ సమావేశాల వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ దురుద్దేశ్యమని డీకే శివకుమార్‌(DK Sivakumar) వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి అని, కేసులో పూర్తిగా నిరపరాధి అయ్యేవరకు నోటీసులు, విచారణ ఉంటాయన్నారు. 

Updated Date - 2022-09-17T17:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising