ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: వర్ష బీభత్సానికి బీడీఏ వైఫల్యమే కారణం

ABN, First Publish Date - 2022-09-15T16:45:05+05:30

నాడప్రభు కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగర ప్రస్తుత దుస్థితికి దిక్కూ దిశ లేకుండా సాగుతున్న, పీకల్లోతు అవినీతిలో కూరుకున్న బెంగళూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - శాసనసభలో ధ్వజమెత్తిన మాజీ సీఎం కుమారస్వామి 


బెంగళూరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నాడప్రభు కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగర ప్రస్తుత దుస్థితికి దిక్కూ దిశ లేకుండా సాగుతున్న, పీకల్లోతు అవినీతిలో కూరుకున్న బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) కారణమని జేడీఎస్‌ తీవ్ర ఆరోపణ చేసింది. శాసనసభలో బుధవారం అతివృష్టిపై 69వ నిబంధన కింద జరుగుతున్న చర్చలో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) పాల్గొని సుదీర్ఘ ప్రసంగం చేశారు. బెంగళూరుకు వర్షం సమస్య కొత్తది కాదని 1999 తర్వాత ఐటీ బీటీ రంగాలు గణనీయంగా విస్తరించినప్పటికీ ఆ దిశలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడమే సమస్య తీవ్రతకు కారణమన్నారు. చెరువులను పూడ్చి నిర్మించిన జేపీ నగర్‌ డాలర్స్‌ కాలనీలో ఉంటున్నవారంతా దాదాపు శ్రీమంతులేనని పేర్కొన్నారు. బెంగళూరును సింగపూర్‌ చేస్తామంటూ ప్రగల్భాలు పలికినవారంతా ఏమయ్యారంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు(Bangalore) నగరాన్ని ఉద్ధరించలేనివారు, తమ జిల్లా రామనగర అభివృద్ధిపై కూనిరాగాలు తీస్తున్నారన్నారు. కేంద్ర బృందం పర్యటన మొక్కుబడిగా సాగిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రసంగం మొత్తంలో ఆయన ప్రభుత్వ వైఫల్యమే ప్రస్తుత దుస్థితికి కారణమని విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-09-15T16:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising