ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Chief Minister: భారీ మాలలతో కుమారస్వామి రికార్డు

ABN, First Publish Date - 2022-12-31T12:09:47+05:30

జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) కొత్త రికార్డు సృష్టించారు. పంచరత్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 33 రోజులు 500కు పైగా క్రేన్‌ హారాలు

- ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తింపు

బెంగళూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) కొత్త రికార్డు సృష్టించారు. పంచరత్న పేరుతో శాసనసభ ఎన్నికల ప్రచారాలు చేపట్టిన అయనకు కేవలం 33 రోజుల్లోనే 500కు పైగా భారీ మాలలు క్రైన్ల ద్వారా వేశారు. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌గా నిలిచినట్లు సంబంధిత సంస్థల ప్ర తినిధులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కుమారస్వామిని కలసిన వారు ప్రశంసాపత్రాన్ని బహూకరించారు. గురువారం తుమకూరు గ్రామీణ నియోజకవర్గంలో కుమారస్వామి యల్లాపురలో బసచేశారు. అక్కడే ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత మోహిత్‌కుమార్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్ణేత ఆర్‌. హరీష్‌ ప్రశంసాపత్రాలను, మెడల్స్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా మోహిత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇదో ప్రత్యేకమైన రికార్డు అన్నారు. రాజకీయనేత ఒకరికి ఇంతటి స్థాయిలో గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు. ఇదే సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ గజమాలలు వేస్తున్నారంటే కార్యకర్తల అభిమానంగా భావించామని, ఇందుకు రికార్డు దక్కడం సంతోషదాయకమన్నారు. ఇది కార్యకర్తల అభిమానానికి నిదర్శనమన్నారు. పంచరత్న యాత్ర ప్రారంభమై 34 రోజులు ముగిసింది. 33 రోజులకే 500కు పైగా భారీ మాలలను క్రైన్ల ద్వారా కుమారస్వామికి బహూకరించారు. సాధారణంగా పూలు, యాపిల్‌, చీనీ కాయల హారాలు పలు చోట్ల వేసే సంప్రదాయం ఉంది. కానీ కుమారస్వామికి దోసకాయలు, కొబ్బరి, బెల్లం, వివిధ రకాల పూలహారాలు వేశారు. బుధవారం స్కూల్‌ బ్యాగులతో చేసిన హారాన్ని సమర్పించగా, అ దే రోజు వరిగింజలతో చేసిన గజమాల వేశారు. గురువారం 15వేల నాణేలతో తుమకూరులో హా రం సమర్పించారు. దాదా పు అన్ని రకాల కూరగాయలతో హారాలను ఇప్పటిదాకా కుమారస్వామికి వేశారు.

Updated Date - 2022-12-31T12:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising