ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ్‌వాదీ పార్టీలో చేరిన యూపీ బీజేపీ మాజీ మంత్రులు

ABN, First Publish Date - 2022-01-14T22:42:36+05:30

ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు యూపీ బీజేపీ మాజీ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యూపీ మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ నేడు అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)లో చేరారు. వీరితోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు భగవతి సాగర్, వినయ్ శాక్య, రోషన్ లాల్ వర్మ, ముకేశ్ వర్మ, బ్రజేశ్ కుమార్ ప్రజాపతి కూడా ఎస్‌పీ తీర్థం పుచ్చుకున్నారు.


అలాగే, అప్నాదళ్ ఎమ్మెల్యే చౌదరి అమర్ సింగ్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే నీరజ్ కుశావహ మౌర్య, బీజేజీ మాజీ ఎమ్మెల్సీ హర్పల్ సైనీ, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే బలరామ్ సైనీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ సింగ్, మాజీ సహాయమంత్రి విద్రోహి మౌర్య, మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పదమ్ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బన్సీ సింగ్ పహాదియా ఎస్‌పీలో చేరారు.


వచ్చే నెలలో యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో పలు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఇలా షెడ్యూలు ప్రకటించిందో, లేదో యూపీలోని అధికార బీజేపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది.

Updated Date - 2022-01-14T22:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising