ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fly overs: ఫ్లై ఓవర్లకు సొబగులు

ABN, First Publish Date - 2022-12-22T11:17:08+05:30

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ సింగార చెన్నై 2.0(Singara Chennai 2.0) పథకం అమలులో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్తంభాలకు అందమైన పెయింటింగ్‌లు

- బ్రిడ్జి దిగువున పూల మొక్కలు

చెన్నై, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ సింగార చెన్నై 2.0(Singara Chennai 2.0) పథకం అమలులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారి వంతెన స్తంభాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకూ రహదారి వంతెనల దిగువనున్న స్తంభాల్లో రాజకీయ పార్టీల పోస్టర్లు లేదా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రచార పెయింటింగ్‌లుండేవి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల స్తంభాలు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశాలను చూపరులకు ఆహ్లాదం కలిగించేలా చిన్న చిన్న పూలకుండీలను తీర్చిదిద్దుతున్నారు. ఇదే విధంగా ఫ్లైఓవర్‌ స్తంభాలపై ప్రస్తుతం అందమైన చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఈ స్తంభాలపై చిత్రకారులతో అందమైన బొమ్మలను గీయించారు. ఆహ్లాదకరంగా ఉన్న ఆ బొమ్మలను పాదచారులే కాకుండా బస్సులలో వెళ్లే ప్రయాణికులు సైతం చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కోయంబేడు బస్‌స్టేషన్‌(Koyambedu Bus Station) ఎదుట ఉన్న ఫ్లైఓవర్‌ ప్రాంతం పూర్తిగా ఓ పిక్నిక్‌ స్పాట్‌ను తలపించేలా కార్పొరేషన్‌ అధికారులు తీర్చిదిద్దారు. ఆ ఫ్లైఓవర్‌ దిగువన పచ్చటి మొక్కలను పెంచుతున్నారు. అంతే కాకుండా అన్నానగర్‌ రహదారివైపు ఈ ఫ్లైఓవర్‌ ముగిసే చోట అందమైన వాటర్‌ ఫౌంటైన్లు కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఈ వాటర్‌ ఫౌంటెన్లు వివిధ రంగుల విద్యుత్‌ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి. ఇక మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డు వద్దనున్న ఫ్లైవోర్‌ దిగువభాగం ప్రస్తుతం పాదచారులు సేదతీరే ప్రాంతంగా మారింది.

Updated Date - 2022-12-22T11:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising