ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరికేన్‌ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం

ABN, First Publish Date - 2022-10-03T09:08:44+05:30

ఇయన్‌ హరికేన్‌ ధాటికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం భారీగా నష్టపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

47 మంది మృతి.. భారీగా దెబ్బతిన్న ఇళ్లు

ఫోర్ట్‌ మెయర్స్‌, అక్టోబరు 2: ఇయన్‌ హరికేన్‌ ధాటికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం భారీగా నష్టపోయింది.  దాదాపు 47 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. దక్షిణ కరోలినాలో మరో పది మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. అలలు ముంచెత్తడంతో ఇప్పటికీ ఫ్లోరిడా, దక్షిణ కరోలినా తదితర ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టలేదు. చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా బంద్‌ అయింది. సుమారు 2.80 లక్షల మంది విద్యుత్‌ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నారు. సుమారు 30 అడుగుల మేర అలలు ఎగిసిపడడంతో ఫ్లోరిడాలో భారీ సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ ఇళ్లలో ఎవరైనా చిక్కుకుపోయారేమోనని వలంటీర్లు, అధికారులు పడవల్లో వెళ్లి మరీ గాలిస్తున్నారు. ఇలా సుమారు 1000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద హరికేన్‌లలో ఇయాన్‌ ఒకటిగా చెబుతున్నారు. మరికొద్ది రోజులు వరద ప్రభావం ఉండొచ్చని హరికేన్‌ సెంటర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-10-03T09:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising