ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదలో చిక్కుకున్న యువకులు

ABN, First Publish Date - 2022-07-17T16:39:17+05:30

మెట్టూరు డ్యాం నుంచి విడుదల చేసిన నీటిలో చిక్కుకున్న యువకులను అధికారులు సురక్షితంగా రక్షించారు. సేలం జిల్లా మెట్టూరు డ్యాం శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - రక్షించిన అధికారులు


ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 16: మెట్టూరు డ్యాం నుంచి విడుదల చేసిన నీటిలో  చిక్కుకున్న యువకులను అధికారులు సురక్షితంగా రక్షించారు. సేలం జిల్లా మెట్టూరు డ్యాం శనివారం ఉదయం 120 అడుగుల సామర్ధ్యానికి చేరుకోవడంతో, డ్యాంలోని 16 గేట్ల ద్వారా అధికారులు తొలివిడతగా 25 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో తారామంగళానికి చెందిన ముగ్గురు యువకులు భారీగా వస్తున్న వరద సమీపంలో సెల్ఫీ తీసుకొనేందుకు యత్నించారు. అంతలో నీటి ప్రవాహం పెరగడంతో వారు కాలువ మధ్యలోని దిమ్మెపై చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని సురక్షింతంగా రక్షించి, వైద్యచికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెట్టూరు డ్యాం పరీవాహక ప్రాంతాల్లో నీటి ఉధృతి అధికంగా ఉందని, ప్రజలు ఆ ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేయడం, వినోదాల కోసం వెళ్లడం తదితరాలకు పాల్పడరాదని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Updated Date - 2022-07-17T16:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising