ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assam: అబ్జర్వేషన్ హోం నుంచి ఐదుగురు రొహింగ్యాలు పరారీ

ABN, First Publish Date - 2022-07-10T17:48:39+05:30

అస్సాం (Assam)లోని సిల్చార్ (Silchar) అబ్జర్వేషన్ హోం నుంచి ఐదుగురు రొహింగ్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి : అస్సాం (Assam)లోని సిల్చార్ (Silchar) అబ్జర్వేషన్ హోం నుంచి ఐదుగురు రొహింగ్యా (Rohingya) బాలలు జూలై 1న తప్పించుకుపోయారు. వీరిని మే 29న అదుపులోకి తీసుకుని ఇక్కడ ఉంచారు. వీరు రాష్ట్రంలోని వరద పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుని, ఈ హోం గోడను పగులగొట్టి, పరారయ్యారు. ఈ వివరాలను అస్సాం పోలీసులు శనివారం తెలిపారు. 


సిల్చార్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అబ్జర్వేషన్ హోం నుంచి ఐదుగురు రొహింగ్యా బాలలు పరారైనట్లు అస్సాం పోలీసులు (Assam Police) తెలిపారు. వీరిని మే 29న అదుపులోకి తీసుకుని, ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. సిల్చార్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని, దీనిని అదునుగా గ్రహించిన వీరు అబ్జర్వేషన్ హోం గోడను పగులగొట్టి, పారిపోయారని చెప్పారు. వీరితోపాటు ఇద్దరు స్థానిక బాలలు కూడా పారిపోయారని చెప్పారు. 


26 మంది రొహింగ్యాలను సిల్చార్ పోలీసులు మే 29న అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు, 12 మంది బాలలు ఉన్నారు. వీరంతా మే 28న ఢిల్లీ నుంచి గువాహటిలోని కామాఖ్య స్టేషన్‌కు రైలులో వచ్చారు. రెండు ఇన్నోవా కార్లలో వీరంతా సిల్చార్ చేరుకున్నారు. వీరిలో వయోజనులను సిల్చార్ కేంద్ర కారాగారంలోనూ, బాలలను అబ్జర్వేషన్‌ హోంలోనూ ఉంచారు. 


Updated Date - 2022-07-10T17:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising