ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Guinea: పాపువా న్యూగినియా దేశాన్ని వణికించిన భారీ భూకంపం...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-09-12T17:44:52+05:30

పాపువా న్యూ గినియా(Papua New Guinea) దేశాన్ని భారీభూకంపం(Earthquake) వణికించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్ట్ మార్సీబై : పాపువా న్యూ గినియా(Papua New Guinea) దేశాన్ని భారీభూకంపం(Earthquake) వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.6 నమోదైన ఈ భూకంపం వల్ల ఐదుగురు మరణించారు. ఈ భూకంపం వల్ల పలు భవనాలు కూలిపోయాయి.(Houses Damaged) పలు చోట్ల కొండచరియలు(landslides) సైతం విరిగిపడ్డాయి. కొండ ప్రాంతంలోని గ్రామాల్లో భూకంపం ప్రభావం వల్ల ఇద్దరు మరణించారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక ఎంపీ కెస్సీ సావంగ్ చెప్పారు. భూకంపం వచ్చినపుడు కొరంగ అల్లువియాల్ మైనింగ్ ప్రాంతంలో ఉన్న ముగ్గురు కార్మికులు గనిలోపల మరణించారు.


కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు భూమిలో పూడుకుపోయాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రాణనష్టం తగ్గిందని పాపువా న్యూ గినియా ప్రధానమంత్రి జేమ్స్ మారాపీ చెప్పారు. 2018 సంవత్సరంలో వాటిల్లిన భూకంపం వల్ల 150 మంది మరణించారు. భూకంపం వల్ల ఇళ్లతోపాటు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.


Updated Date - 2022-09-12T17:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising