ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: మూడంతస్తుల భవనంలో పేలుడు...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-03-04T14:52:09+05:30

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి మూడు అంతస్తుల భవనంలో సంభవించిన భారీ పేలుడులో ఐదుగురు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాగల్‌పూర్ : బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి మూడు అంతస్తుల భవనంలో సంభవించిన భారీ పేలుడులో ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో మరో 8మంది మంది గాయపడ్డారు.పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కుప్పకూలిన భవనం శిథిలాల కింద 10 నుంచి 15 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.క్షతగాత్రులను మాయాగంజ్‌లోని జేఎల్‌ఎన్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే లోపే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.స్థానిక పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల  దూరంలో కజ్వలిచక్ ప్రాంతంలోని అనాథ శరణాలయం పక్కనే ఈ ఘటన జరిగింది. 



శక్తివంతమైన పేలుడు ధాటికి పక్కనే ఉన్న రెండు మూడు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.పేలుడు జరిగిన భవనంలో పటాకుల తయారీ వ్యాపారం సాగుతోందని మహ్మద్ యూసుఫ్‌ చెప్పారు.భవనంలో భద్రపరిచిన గన్‌పౌడర్, అక్రమ బాణసంచా, కంట్రీ మేడ్ బాంబులు పేలుడుకు ప్రాథమిక కారణాలని భాగల్‌పూర్ రేంజ్ డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు.ఫోరెన్సిక్స్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-03-04T14:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising