ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanwar Yatra: కన్వారియాలను ఢీకొన్న ట్రక్కు...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-07-23T13:20:10+05:30

పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హరిద్వార్(ఉత్తరప్రదేశ్): పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ నుంచి శివభక్తులు(Devotees of Lord Shiva) గ్వాలియర్ వెళుతుండగా హత్రాస్ పట్టణం వద్ద శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు వేగంగా వచ్చిన ట్రక్కు(truck) ఢీకొట్టింది. హత్రాస్‌లో కన్వారియాలను ట్రక్కు కొట్టడంతో ఐదుగురు మృతి(dead) చెందగా,మరొకరు గాయపడ్డారు. గాయపడిన శివభక్తుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.గ్వాలియర్ నుంచి శివ భక్తులు హరిద్వార్(Haridwar) నుంచి తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఒక ట్రక్కు వారిపై నుంచి దూసుకుపోయిందని ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కృష్ణ తెలిపారు.


ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ట్రక్ డ్రైవర్ గురించి తమకు సమాచారం అందిందని రాజీవ్ కృష్ణ చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కృష్ణ హామీ ఇచ్చారు.హిందువుల పవిత్ర మాసం శ్రావణంలో గంగా నది నీటిని తీసుకొచ్చి దేవుడికి సమర్పించేందుకు శివుని భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, ఇతర ప్రదేశాలకు కాలినడకన కన్వార్ యాత్ర సాగిస్తారు.ఈ వారం ప్రారంభంలో హరిద్వార్‌లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ప్రవాహానికి ఏడుగురు కన్వారియాలు(Kanwariyas) కొట్టుకుపోయారు. 


నదిలో కొట్టుమిట్టాడుతున్న కన్వారియాలను గుర్తించిన సైనికులు, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో రక్షించారు. జోనల్ మేజిస్ట్రేట్ నరేష్ చౌదరి మాట్లాడుతూ, సైన్యానికి చెందిన ఈతగాళ్ల బృందం ఇప్పటివరకు 18 మంది కన్వారియాలను నీటిలో మునిగిపోకుండా రక్షించిందన్నారు.గంగా ఘాట్‌ల వద్ద భక్తులు నది ప్రవాహానికి దూరంగా ఉండాలని నరేష్ కోరారు.శుక్రవారం కూడా ఓ మహిళ నది నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో ఆమెను రక్షించారు.


Updated Date - 2022-07-23T13:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising