ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palanivel పద్దుపై ప్రజల్లో ఉత్కంఠ

ABN, First Publish Date - 2022-03-18T15:20:28+05:30

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు శుక్రవారం ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలపైనే ఉంది. ఆర్థికశాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు శుక్రవారం ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలపైనే ఉంది. ఆర్థికశాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు జార్జ్‌కోటలో ప్రారంభం కానున్న సమావేశాల్లో ఆయన కాగితరహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలందరికీ అనువుగా ఉండేలా ప్రతి బల్లపైనా ల్యాప్‌టాప్‌లు అమర్చారు. అదే సమయంలో బడ్జెట్‌ ప్రతి పాదనలకు సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు సభలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లపై ప్రదర్శించనున్నారు. శుక్రవారం ఆర్థికమంత్రి రాష్ట్ర బడ్జెట్‌ను దాఖలు చేయనుండగా, శనివారం ఉదయం వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం ప్రత్యేక వ్యవసాయబడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా వుండగా శుక్రవారం బడ్జెట్‌ సమావేశం పూర్తి కాగానే అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమై సభ ఎన్నిరోజులు నిర్వహించా లన్నదానిపై చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్‌ కాగా, పూర్తిస్థాయిలో ప్రవేశ పెడుతున్న తొలిబడ్జెట్‌ కావడం విశేషం. దీంతో సహజంగానే విత్తమంత్రి పళనివేల్‌ బడ్జెట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోయిన విషయం తెలిసిందే. ఆ బడ్జెట్‌లో కొత్త పథకాలు, ఆకర్షక ప్రకటనలు లేకపోవడం డీఎంకే వర్గాలను కాస్త నిరుత్సాహ పరచింది. అందువల్ల ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా వుంటుందని డీఎంకే వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.

Updated Date - 2022-03-18T15:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising