ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED ముందు హాజరైన Farooq Abdullah

ABN, First Publish Date - 2022-05-31T20:22:25+05:30

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మంగళవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) మంగళవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాజ్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. జమ్మూకశ్మీర్ అసోసియేషన్‌లో గతంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.


ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియా అడిగిన ప్రశ్నలకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిస్తూ, సమన్ల గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదని, ఎన్నికలు (జమ్మూకశ్మీర్‌లో) జరిగే అవకాశాలున్నందున అప్పటి వరకూ వాళ్లు తమను చిక్కులు పెట్టవచ్చని అన్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ఈనెల 27న ఆయనకు ఈడీ ఆయనకు సమన్లు పంపింది. ఈ కేసులో 2019లో ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. గతంలో మాదిరిగానే అధికారులకు తమ నేత సహకరిస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాజా సమన్లపై వ్యాఖ్యానించింది. దేశంలోని విపక్ష పార్టీల నేతలకు సమన్లు పంపడం సర్వసాధారణ విషయమేనని జమ్మూకశ్మీర్‌లోని పలువురు విపక్ష నేతలు చెబుతున్నారు. కాగా, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఫరూక్ అబ్దుల్లా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Updated Date - 2022-05-31T20:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising