ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడే పుట్టిన మనవరాలి కోసం హెలికాఫ్టర్ తీసుకున్న రైతు

ABN, First Publish Date - 2022-04-27T22:39:14+05:30

మహారాష్ట్రకు చెందిన ఒక రైతుకు తాజాగా మనవరాలు పుట్టింది. అయితే ఆసుపత్రి నుంచి కోడల్ని మనవరాలిని తీసుకురావడానికి ఆ రైతు ఏకంగా హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. పూణెకు సమీపంలోని బలేవాడలో మంగళవారం వెలుగు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక రైతుకు తాజాగా మనవరాలు పుట్టింది. అయితే ఆసుపత్రి నుంచి కోడల్ని మనవరాలిని తీసుకురావడానికి ఆ రైతు ఏకంగా హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. పూణెకు సమీపంలోని బలేవాడలో మంగళవారం వెలుగు చూసింది ఈ ఘటన. బలేవాడకు చెందిన అజిత్ పాండురంగ్ బల్వద్కర్ అనే రైతు.. తనకు మనవరాలు పుట్టిందనే విషయం తెలుసుకున్నాడు. షెవాల్ వాడిలోని వియ్యంకుల ఇంట్లో ఉన్న కోడలిని, అప్పుడే పుట్టిన మనవరాలిని తీసుకురావడానికి చాపర్‌ను బుక్ చేశాడు. సమాజానికి ఒక సానుకూల సందేశాన్ని ఇవ్వడానికే అతడు ఇలా చేశాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. పాండురంగ్ బల్వద్కర్, సంగీత అజిత్ బల్వద్కర్‌కు రెండోసారి తాతఅమ్మలు అయ్యారు. వారి కుమారుడు క్రిష్ణ బల్వద్కర్, కోడలు అక్షత బల్వద్కర్‌కలు ఇది వరకే ఒక కుమారుడు. కాగా, ప్రస్తుతం పుట్టిన పాప రెండో సంతానం. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-04-27T22:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising