ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్టర్‌ నివాసంపై నకిలీ ఐటీ బృందం దాడి

ABN, First Publish Date - 2022-01-29T14:38:53+05:30

నకిలీ ఐటీ బృందం ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నివాసంపై దాడి చేసి పిస్టల్‌తోపాటు నగదు దోచుకెళ్లిన వారిని సంజయ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐదుగురి అరెస్టు 

- పిస్టల్‌, రూ.3.5 లక్షలు రికవరీ


బెంగళూరు: నకిలీ ఐటీ బృందం ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నివాసంపై దాడి చేసి పిస్టల్‌తోపాటు నగదు దోచుకెళ్లిన వారిని సంజయ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. ఇటీవలే రియల్టర్‌ మృతి చెంద గా కార్యాలయంలోని రికార్డులు పిస్టల్‌తోపాటు మరిన్ని వస్తువులను అతడి కుమారుడు ఇంట్లో భద్రపరిచారు. ఈనెల 23న ఐటీ అధికారుల ముసుగులో రియల్టర్‌ కుమారుడి ఇంటికి వెళ్లినవారు బెదిరించారు. లాకర్‌లోని 3.5 లక్షల నగదుతోపాటు పిస్టల్‌ను తీసుకెళ్లారు. అనుమానం రాగా ఐటీ కార్యాలయాన్ని సంప్రదించిన మేరకు వారు నకిలీలని తేలింది. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఐదుగురిని గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. పిస్టల్‌తోపాటు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నామని, లక్షన్నర రూపాయల నగదును వారినుంచి సేకరించామన్నారు. పట్టుబడినవారిలో మంజునాథ్‌, షోయెబ్‌, దుర్గేశ్‌, కుమార్‌, ప్రశాంత్‌లు ఉన్నారు. మంజునాథ్‌ ఓ పత్రికలో పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. గతంలోనూ వీరు నేరాలకు పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. కారుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనే స్టిక్కర్‌ను గుర్తించినట్టు తెలిపారు. 

Updated Date - 2022-01-29T14:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising