ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra portfolios: కీలక శాఖలు దేవేంద్రునికే..

ABN, First Publish Date - 2022-08-15T00:53:29+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారంనాడు శాఖల కేటాయింపు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఆదివారంనాడు శాఖల కేటాయింపు చేశారు. కీలకమైన హోం (Home), ఆర్థిక శాఖ (Finance)లను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) దక్కించుకున్నారు. పట్టణాభివృద్ధి, ప్రజా పనుల (Public projects) శాఖలను ఏక్‌నాథ్ షిండే తనవద్దే ఉంచుకున్నారు. ఆగస్టు 9న షిండే, ఫడ్నవిస్ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. 18 మంది మంత్రులను మహారాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆమోదం తెలిపిన వెంటనే శాఖల కేటాయింపులను ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.


శాఖలివే...

-రాధాకృష్ణ విఖే-పాటిల్ : రెవన్యూ, పశు సంవర్ధక, డెయిరీ డవలప్‌మెంట్.

-సుధీర్ ముంగంటి వార్ : అడవులు, సాంస్కృతిక శాఖ, మత్స్య పరిశ్రమ.

-చంద్రకాంత్ పాటిల్ : ఉన్నత, సాంకేతిక విద్య, జౌళి పరిశ్రమ, పార్లమెంటరీ పనులు

-డాక్టర్ విజయకుమార్ గవిట్ : గిరిజనాభివృద్ధి

-గిరీష్ మహాజన్ : గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమం

-గులాబ్‌రావు పాటిల్ : నీటి సరఫరా, పారిశుద్ధ్యం

-దాదా భుసే : నౌకాశ్రయాలు, గనులు

-సంజయ్ రాథోడ్ : ఫుడ్ అండ్ గ్రగ్ అడ్మినిస్ట్రేషన్

-సురేష్ ఖడే : కార్మిక శాఖ

-సందీపన్ భుమ్రే - ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్

-ఉదయ్ సామంత్ : పరిశ్రమలు

-ప్రొఫెసర్ తానాజీ సావంత్ : ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ

-రవీంద్ర చవాన్ : ప్రజాపనులు (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల పరిరక్షణ

-అబ్దుల్ సత్తార్ : వ్యవసాయం

-దీపక్ కెసార్కర్ : పాఠశాల విద్య, మరాఠీ భాష

-అతుల్ సవే: కోఆపరేషన్, అదర్ బ్యాక్‌వార్డ్, బహుజన్ వెల్ఫేర్

-శంభురాజ్ దేశాయ్ : రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ

-మంగళ్ ప్రభాత్ లోథా: పర్యాటకం, స్కిల్‌ డవలప్‌మెంట్, ఎన్టర్‌పెన్యూర్‌షిప్, మాతా, శిశు సంక్షేమం.

Updated Date - 2022-08-15T00:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising