ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

climaxకు చేరిన మహారాష్ట్ర రాజకీయం...కొత్త సర్కారు ఏర్పాటుపై బీజేపీ నేతల కసరత్తు

ABN, First Publish Date - 2022-06-30T13:05:58+05:30

మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజ్ హోటల్‌లో అర్దరాత్రి సమావేశాలు

తదుపరి నిర్ణయాధికారం దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ షిండేలకు అప్పగింత 

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది.ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బుధవారం అర్దరాత్రి బీజేపీ నాయకులు పలు దఫాలుగా సమావేశాలు జరిపారు.కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నేతలు కసరత్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్,శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేలు భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు.


తదుపరి ప్రభుత్వ ఏర్పాటు గురించి దేవేంద్ర ఫడణవీస్  ఏక్నాథ్ షిండేలు నిర్ణయం తీసుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెప్పారు.శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతి నుంచి బయల్దేరి గోవాకు చేరుకుని హోటల్ లో బస చేశారు. అయితే ఇంతలో సీఎం ఉద్ధవ్ తన రాజీనామాను ప్రకటించడంతో గురువారం బలపరీక్ష లేనందున ఇప్పుడు ముంబయికి రావద్దని రెబల్ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ బుధవారం రాత్రి కోరారు.మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రోజున రావాలని పాటిల్ శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు సూచించారు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే అతని కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చి స్వయంగా రాజీనామా చేశారు. అనంతరం తండ్రీకొడుకులు ఆలయాన్ని సందర్శించారు.


కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోష్యారి ఉద్ధవ్ ను కోరారు.ఉద్ధవ్ నాటకీయ రాజీనామా తర్వాత మహారాష్ట్ర బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, భవిష్యత్తు కార్యాచరణను గురువారం నిర్ణయించి ప్రకటిస్తామని చెప్పారు. ఉద్ధవ్ రాజీనామా చేసినప్పుడు ఫడణవీస్ తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో బీజేపీ శాసనసభ సమావేశానికి వచ్చారు. సమావేశంలో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.


Updated Date - 2022-06-30T13:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising