ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraine ఆసుపత్రిలో దాడులు బూటకమంటూ రష్యా పోస్టులు...ఫేస్‌బుక్ తొలగింపు

ABN, First Publish Date - 2022-03-17T13:43:16+05:30

ఉక్రెయిన్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బాంబు దాడి చేసిందన్న నివేదికలు బూటకమని ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లోని రష్యన్ ఎంబసీ ఖాతాల్లో పోస్ట్ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : ఉక్రెయిన్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బాంబు దాడి చేసిందన్న నివేదికలు బూటకమని ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లోని రష్యన్ ఎంబసీ ఖాతాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టులను ఫేస్‌బుక్ తొలగించిందని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు.హింసాత్మక సంఘటనలు బూటకమని చెబుతూ   తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం చేసిన పోస్ట్‌లను తీసివేసింది. దీని తర్వాత కూడా రష్యన్ ఎంబసీ ట్విట్టర్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ ఖాతాల్లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారని ఇజ్రాయెలీ వాచ్‌డాగ్ పేర్కొంది. ఉక్రేనియన్ నగరంలోని మారియుపోల్‌లోని ప్రసూతి, పిల్లల ఆసుపత్రిపై మార్చి 9వతేదీన జరిగిన వైమానిక దాడిలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు.




రష్యా ఆసుపత్రిపై బాంబు దాడిపై తన వైఖరిని మార్చుకుంది. ఆ సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆసుపత్రిపై బాంబు దాడి చేయలేదని ఖండించింది. రష్యా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్ట్‌లు బాంబు దాడికి సంబంధించిన నివేదికలు బూటకమని పేర్కొన్నాయి.


Updated Date - 2022-03-17T13:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising