ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాకు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్

ABN, First Publish Date - 2022-02-26T16:57:30+05:30

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఫేస్‌బుక్ షాక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. తన వేదికపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తుంటామని తెలిపింది. ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనియెల్ గ్లెయిచెర్ ఓ ట్వీట్‌లో శనివారం ఈ వివరాలను వెల్లడించారు. 


ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంపై రష్యన్ స్టే్ట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లను వేయడాన్ని, లేదా, కంటెంట్‌ను మానెటైజింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు నథనియెల్ తెలిపారు. ఈ కొత్త ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయన్నారు. రష్యన్ స్టేట్ మీడియాకు లేబుల్స్‌ను వేయడం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రచురితం కాబోవన్నారు. ఈ మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ వారాంతంలో కూడా కొనసాగుతాయని చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం నిశితంగా గమనిస్తుంటామన్నారు. 


అంతకుముందు ట్విటర్ కూడా ఇదే విధంగా రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్లయిజ్‌మెంట్లు, కంటెంట్ మానిటైజింగ్‌పై నిషేధం విధించింది. 


Updated Date - 2022-02-26T16:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising