ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kyiv, Kharkiv నగరాలపై రష్యా క్షిపణులతో దాడి...భారీ పేలుళ్లు

ABN, First Publish Date - 2022-03-15T15:19:20+05:30

ఉక్రెయిన్ దేశంలోని కైవ్, ఖార్కివ్ నగరాలపై రష్యా క్షిపణులతో విరుచుకు పడటంతో ఆ నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని కైవ్, ఖార్కివ్ నగరాలపై రష్యా క్షిపణులతో విరుచుకు పడటంతో ఆ నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఒక వైపు చర్చలు కొనసాగుతుండగా, మరో వైపు రష్యా నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉంది. రష్యా సైనికదాడి 20వరోజుకు చేరుకుంది. రష్యా దండయాత్రలో ఉక్రెయిన్ దేశంలో 90 మంది పిల్లలు మరణించగా, మరో 100 మందికి పైగా పిల్లలు గాయపడ్డారు.రష్యన్ దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మారియుపోల్‌ నగరంలో 2,357 మంది మరణించారని సిటీ కౌన్సిల్ తెలిపింది.ఉక్రెయిన్‌లో హత్యకు గురైన అమెరికా జర్నలిస్టు కుటుంబానికి అధ్యక్షుడు జెలెన్స్కీ సంతాపం తెలిపారు.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ దేశంలో పౌరుల మరణాల సంఖ్య 1,761కి చేరుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం మార్చి 16న తీర్పు వెలువరించనుంది.ఉక్రెయిన్‌పై రష్యా 900కు పైగా క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


Updated Date - 2022-03-15T15:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising