ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైన్యంపై ఖర్చు భారంగా చూడొద్దు: ఆర్మీ చీఫ్

ABN, First Publish Date - 2022-04-14T00:13:16+05:30

దేశ సైన్యంపై పెట్టే ఖర్చును ఆర్థికంగా భారంగా భావించకూడదు అని అభిప్రాయపడ్డారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్.ఎమ్.నరవాణే. గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నరవాణే పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ సైన్యంపై పెట్టే ఖర్చును ఆర్థికంగా భారంగా భావించకూడదు అని అభిప్రాయపడ్డారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్.ఎమ్.నరవాణే. గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో నరవాణే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సరిహద్దుల్లో సైన్యం బలంగా ఉన్నప్పుడే ఒక దేశం సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి, మన దేశం.. సైన్యంపై పెట్టే ఖర్చును ఆర్థికంగా భారంగా భావించకూడదు. ఒక పెట్టుబడిలా చూడాలి’’ అని నరవాణే అన్నారు. ‘‘దేశ భద్రత ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంటుంది. అందరూ బాధ్యతగా ఉండాలి. వాట్సాప్‌లో వచ్చే తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాంటివాటిని ప్రచారం చేయకూడదు. కొన్నిసార్లు చిన్న వార్తలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. దీనివల్ల అంతిమంగా దేశమే నష్టపోతుంది’’ అని నరవాణే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ సైన్యంలో మహిళల సంఖ్య పెరుగుతోందన్నారు. 

Updated Date - 2022-04-14T00:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising