ఎగ్జిట్‌పోల్స్ సానుకూలం!
ABN, First Publish Date - 2022-12-07T04:27:50+05:30
గుజరాత్లో ఎగ్జిట్ పోల్స్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంతృప్తి ప్రకటించారు. ఎగ్జిట్‌పోల్స్ సానుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
గుజరాత్లో 15-20% ఓట్లు గొప్ప విషయం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబరు 6: గుజరాత్లో ఎగ్జిట్ పోల్స్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంతృప్తి ప్రకటించారు. ఎగ్జిట్‌పోల్స్ సానుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రంలో, అదీ ఒక కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు సాధించడమంటే గొప్ప విషయం’’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్లో ఆప్‌కు 8 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ విజయబావుటా ఎగరవేస్తుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడం పట్ల కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడనుందన్నారు. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్ పట్ల నమ్మకం ఉంచారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎగ్జిట్‌పోల్స్ నిరాశపరిచాయి: కాంగ్రెస్
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్‌పై కాంగ్రెస్ పెదవి విరిచింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రె్‌సకు మరోసారి నిరాశ తప్పదని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. గుజరాత్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని.. హిమాచల్‌లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమవుతుందని తెలిపాయి. గుజరాత్లో ఎగ్జిట్‌పోల్స్ నిజమైతే.. అవి నిరాశపరిచే ఫలితాలేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు.
Updated Date - 2022-12-07T04:27:51+05:30 IST