ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ఖజానాలోని నెక్లెస్ విక్రయించిన ఇమ్రాన్ ఖాన్?

ABN, First Publish Date - 2022-04-13T23:28:28+05:30

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనాకు చెందిన  రూ.18 కోట్ల విలువైన నెక్లెస్‌ను బయట ఓ జ్యుయలరీకి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ విచారణ ప్రారంభించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బహుమతిగా నెక్లెస్‌ను స్వీకరించారు. దీనిని పాకిస్తాన్ తొష-ఖానా(ప్రభుత్వ బహుమతుల నిధి)లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానికి మాజీ ప్రత్యేక సలహాదారు జుల్ఫీకర్ బుఖారీకి ఇచ్చారు. ఆయన దీనిని లాహోర్‌లోని జ్యుయలరీకి రూ.18 కోట్లకు విక్రయించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) విచారణ ప్రారంభించిందని పేర్కొంది. వాస్తవానికి ప్రభుత్వ బహుమతులను ప్రధాని తన సహాయకుల వద్ద ఉంచవచ్చు. అయితే ఆ గిఫ్ట్ విలువలో సగం మొత్తం సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనను పాటించకుండా కేవలం కొన్ని వందల రూపాయలు మాత్రమే పాకిస్థాన్ ఖజానాలో జమ చేశారని రిపోర్ట్ వివరించింది.

Updated Date - 2022-04-13T23:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising