ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress: బెంగళూరును గుంతల నగరంగా మార్చేశారు

ABN, First Publish Date - 2022-09-02T18:37:26+05:30

నాసిరకం పనులతో రాజధాని బెంగళూరు నగరాన్ని గుంత నగరంగా మార్చేశారని భారీ వర్షాల దెబ్బకు నగరం మునిగిపోయే పరిస్థితిని తెచ్చారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                            - ధ్వజమెత్తిన కాంగ్రెస్‌


బెంగళూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): నాసిరకం పనులతో రాజధాని బెంగళూరు నగరాన్ని గుంత నగరంగా మార్చేశారని భారీ వర్షాల దెబ్బకు నగరం మునిగిపోయే పరిస్థితిని తెచ్చారని కాంగ్రెస్‏కు‏ చెందిన మాజీ మంత్రులు కృష్ణబైరె గౌడ, ప్రియాంక ఖర్గే(Former Ministers Krishnabaire Gowda and Priyanka Kharge) ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం వీరు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ప్రపంచ ఐటీబీటీ రాజధానిగా విలసిల్లిన బెంగళూరు నగరం నేడు గుంతలమయంగా మారిందన్నారు. నగర అభివృద్ధిపై దృష్టి సారించేందుకు ఈ ప్రభుత్వానికి తీరిక లేదన్నారు. నగరం మాదక ద్రవ్యాల కేంద్రంగానూ, ప్రతిరోజూ మతపరమైన ఉద్రిక్తల మధ్య నలుగుతోందన్నారు. బెంగళూరు(Bangalore)లో మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు హాహాకారాలు చేస్తుంటే ముఖ్యమంత్రి బొమ్మై తీరికగా నగర పర్యటన జరుపడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 50 శాతం కమీషన్‌ దెబ్బకు నగరంలో ఉన్న పరిస్థితిని కళ్ళారా తిలకించేందుకు పర్యటిస్తున్నట్లుందని వారు ఎద్దేవా చేశారు. బీబీఎంపీ(BBMP)లో స్థానిక ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడం అన్నింటా అధికారుల పెత్తనం ప్రస్తుత దుస్ధితికి కారణమని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రస్తుతం నెలకొన్న దుస్ధితికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. భారీ వర్షం పడితే చాలు నగర ప్రజలు నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోందన్నారు.

Updated Date - 2022-09-02T18:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising