ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ex Cm ఇంట విషాదం

ABN, First Publish Date - 2022-01-29T14:20:17+05:30

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఇంట విషాదం నెలకొంది. ఆయన మనవరాలు డాక్టర్‌ సౌందర్య (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మనవరాలి ఆత్మహత్య 

- ఫోన్‌లో పరామర్శించిన ప్రధాని 

- హుటాహుటిన చేరుకున్న సీఎం 


బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఇంట విషాదం నెలకొంది. ఆయన మనవరాలు డాక్టర్‌ సౌందర్య (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా రు. యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు సౌందర్యకు మూడేళ్ల క్రితం డాక్టర్‌ నీరజ్‌తో వివాహమైంది. వీరికి 9 నెలల మగశిశువు ఉన్నారు. ఇటీవల సౌందర్య మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. దంపతుల మధ్య ఎటువంటి విభేదాలు లేవంటున్నా, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సౌందర్య, నీరజ్‌ నగరంలోని ప్రతిష్టాత్మకమైన ఎంఎస్‌ రామయ్య మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పురుడుకోసం తాత యడియూరప్ప ఇంట్లోనే గడిపారు. గురువారం సౌందర్య వెనుతిరిగి భర్త చెంతకు వచ్చారు. ఉదయం 8 గంటలకు భర్త నీరజ్‌ ఆసుపత్రికి విధులకు వెళ్లారు. 9 నెలల చిన్నారితోపాటు సౌందర్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. కాసేపటికే పనిమనిషి రాగా సౌందర్య మరో గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పనిమనిషి పరిశీలించగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమె సమీపవాసులకు సమాచారం అందించారు. హుటాహుటిన బంధువులు అక్కడికి చేరుకున్నారు. విష యం తెలియగానే సీఎం బసవరాజ్‌ బొమ్మై కావేరి నివాసానికి చేరుకుని యడియూరప్పను పరామర్శించారు. హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఉన్నారు. అప్పటికే పోలీసులు పార్థివదేహాన్ని బౌరింగ్‌ ఆసుపత్రికి తరలించా రు. ముగ్గురు వైద్యులు, తహసీల్దార్‌ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం అబ్బిగెరెలోని డాక్టర్‌ నీరజ్‌ నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. సాయంత్రం వీరశైవలింగాయత సంప్రదాయబద్ధంగా సోలదేవనహళ్లిలోని భర్తకు చెందిన కల్పవృక్ష ఫాంహౌ్‌సలో అంత్యక్రియలు నిర్వహించారు.  

యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆత్మహత్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. యడియూరప్పకు ధైర్యం చెప్పారు. కాగా ప్రతిపక్షనేత సిద్దరామయ్య ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. తనకు సుదీర్ఘకాల రాజకీయ మిత్రుడు యడియూరప్ప మనుమరాలిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. ఎదిగిన బిడ్డ కుటుంబ సభ్యులకు దూరం కావడంతో తలెత్తే బాధ తాను అనుభవించానన్నారు. సౌందర్యను కోల్పోయిన యడియూరప్ప కుటుంబానికి దేవుడు భరించే శక్తిఇవ్వాలని ఆకాంక్షించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమార సంతాపం తెలిపారు. 

Updated Date - 2022-01-29T14:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising