ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయేంద్రకు Ticketపై చర్చలు వద్దు

ABN, First Publish Date - 2022-05-26T17:26:56+05:30

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ రాకపోవడంపై ఇష్టారాజ్యంగా కల్పితాలు, చర్చలు వద్దంటూ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మాజీ సీఎం యడియూరప్ప


బెంగళూరు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ రాకపోవడంపై ఇష్టారాజ్యంగా కల్పితాలు, చర్చలు వద్దంటూ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కుమారుడు విజయేంద్రకు టికెట్‌ దక్కని విషయంలో విపరీతార్థాలు అవసరం లేదన్నారు. విజయేంద్రకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారన్నారు. పార్టీలో క్రమశిక్షణగా ఉండేవారిని ఎప్పటికీ వదులుకోరన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే త మ లక్ష్యమన్నారు. బీఎల్‌ సంతోష్‌ కారణంగా విజయేంద్రకు టికెట్‌ రాలేదనే చర్చలను ప్రస్తావిస్తూ ఇది సంబంధం లేని అంశమని కొట్టిపారేశా రు. అనవసరంగా మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయన్నారు. ప్రస్తు తం విజయేంద్ర పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని, భవిష్యత్‌ అవకాశాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయిస్తారని తెలిపారు.

Updated Date - 2022-05-26T17:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising