ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-02-26T17:32:34+05:30

మీడియా సహకారం వల్లే తాను ఇంతటి వాడినయ్యానని, ఈ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ నగరంలోని గాయత్రి విహార్‌లో గురువారం రాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మీడియా సహకారం వల్లే తాను ఇంతటి వాడినయ్యానని, ఈ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ నగరంలోని గాయత్రి విహార్‌లో గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మ్యాన్‌ ఆఫ్‌ది ఇయర్‌ పురస్కారాన్ని ఆయన సీఎం బసవరాజ్‌ బొమ్మై చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పాత్రికేయులు తన ప్రజాపోరాటాల్లో సదా అండగా ఉన్నారని ప్రశంసలు గుప్పించారు. కొవిడ్‌ వేళ మృతిచెందిన పాత్రికేయుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల నష్టపరిహారం అందజేశామన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ సమాజాన్ని సరైన దిశలో నడిపించే విషయంలో పాత్రికేయుల కృషి అపూర్వమన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2020- 2021 సంవత్సరాలకు గాను పలువురు ఉత్తమ పాత్రికేయులకు కూడా పురస్కారాలను అందజేశారు. మ్యాన్‌ ఆఫ్‌ది పురస్కారం అందుకున్న వారిలో విప్రో సంస్థ అధినేత అజీం ప్రేమ్‌జీ ప్రత్యేక పురస్కారాలు అందుకున్న వారిలో పద్మశ్రీ హరేకళ హాజప్ప, నటుడు డాక్టర్‌ సుదీప్‌, డాక్టర్‌ దేవిశెట్టి, మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ కూడా ఉన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు సదాశివశెణై, ప్రధాన కార్యదర్శి హెచ్‌వీ కిరణ్‌తో పాటు పదాధికారులు హాజరయ్యారు. ఇదే సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రముఖ పాత్రికేయుడు రంగనాథ్‌ పురస్కారాలను అందజేశారు.

Updated Date - 2022-02-26T17:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising