ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: ఆయన సీఎం అయితే అసూయ పడను..

ABN, First Publish Date - 2022-08-20T18:42:42+05:30

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌(DK Sivakumar) ముఖ్యమంత్రి అయితే అసూయపడనని జేడీఎస్‌ కీలక నేత, మాజీ సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌(DK Sivakumar) ముఖ్యమంత్రి అయితే అసూయపడనని జేడీఎస్‌ కీలక నేత, మాజీ సీఎం కుమారస్వామి మనసులో మాట చెప్పారు. గురువారం చిత్రదుర్గ జిల్లా హిరియూరులో నాడప్రభు కెంపేగౌడ జయంతి, ఒక్కలిగల జాగృతి సమావేశం జరిగింది. ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ, పట్ట నాయకనహళ్ళి మఠాధిపతి నంజావదూత స్వామీజీ సహా డీకే శివకుమార్‌ తది తరులు భాగస్వామ్యులయ్యారు. ఇదే సందర్భంగా కుమారస్వామి మాట్లా డుతూ డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితిలోను అసూయ పడేది లేదన్నారు. కానీ కాంగ్రెస్‌లోనే బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఒకరు కుర్చీ కోసం టవల్‌ వేశారని సిద్దరామయ్య పేరు చెప్పకుండా ప్రస్తావించారు. సీఎం హోదా కోసం డీకే శివకుమార్‌ పోటీ చేయనీ రెండుసార్లు ముఖ్య మంత్రిగా వ్యవహరించిన నేను సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తానన్నారు. అధి కారం ఎవరికైనా దక్కవచ్చునని భగవంతుడి ఆశీస్సులు ఉండాలన్నారు. ఉత్తర కర్ణాటక జలవనరుల ప్రాజెక్టుల కోసం దేవేగౌడ(Deve Gowda) ఎంతగానో కృషి చేశారని అందుకు ఆల్మట్టి ప్రాంతానికి చెందిన సామాన్య రైతు ఒకరు భారతరత్న దేవేగౌడ అంటూ బోర్డు పెట్టుకున్నారని కానీ అదే ప్రాంతంలో జేడీఎస్‌కు దక్కిన ప్రజాదరణ ఏమాత్రం లేదని విచారం వ్యక్తం చేశారు. మా నుంచి అన్నీ పొందిన వారే మా గొంతులు కోశారంటూ మండిపడ్డారు. వాల్మీకి సముదాయం నుంచి 15మందికి పైగా ఎమ్మెల్యే గెలుపొందేందుకు దేవేగౌడ సహకరిస్తే నేను సీఎం అయ్యాక వ్యతిరేకంగా పాదయాత్ర చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో నంజావదూత స్వామీజీ మాట్లాడుతూ డీకే శివకుమార్‌, కుమారస్వామిలలో ఎవరు సీఎం అయినా సంతోషమే అన్నారు. ఇరు వురిలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కచ్చితమన్నారు. కుమారస్వామి రెండో సారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో డీకే శివకుమార్‌(DK Sivakumar) ఉత్సాహం వర్ణించ లేమని ప్రస్తుతం ఒకే వేదికపై ఉండటం సంతోషమన్నారు. పరోక్షంగా ఇరు వురు నేతలు సమర్థించుకునేలా వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన చర్చకు కారణమైంది.

Updated Date - 2022-08-20T18:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising