ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Chief Minister: విధాన సౌధలో దోపిడీ దొంగలు

ABN, First Publish Date - 2022-08-20T18:14:34+05:30

దోపిడీ దొంగలను చూడాలంటే చంబల్‌ లోయకు వెళ్లాల్సిన పని లేదని బెంగళూరుకు వస్తే విధానసౌధలోనే కనిపిస్తారని బీజేపీ నేతలపై మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - మాజీ సీఎం కుమారస్వామి తీవ్ర ఆరోపణ


రాయచూరు(బెంగళూరు), ఆగస్టు 19: దోపిడీ దొంగలను చూడాలంటే చంబల్‌ లోయకు వెళ్లాల్సిన పని లేదని బెంగళూరుకు వస్తే విధానసౌధలోనే కనిపిస్తారని బీజేపీ నేతలపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) తీవ్రస్థాయిలో ఆరోపించారు. జిల్లాలోని మాన్వి ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్‌(MLA Raja Venkatappanayake) జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం మాన్వి పట్టణానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన రీతిలో వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సంపూర్ణ మెజార్టీని కట్టబెడితే ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు. రైతులు, కార్మికులు, కర్షకుల ప్రయోజనాలను పరిరక్షించలేకపోతే తాము పార్టీనే రద్దు చేసుకుంటామని సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల పలు విమర్శలు సంధించిన కుమారస్వామి బీజేపీ నేతలు అధికారమే పరమావధిగా ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తుండడాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించాలని కోరారు. 

Updated Date - 2022-08-20T18:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising