ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పు చేసిన వారిని శిక్షించాలి: కుమారస్వామి

ABN, First Publish Date - 2022-05-01T16:36:06+05:30

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల్లో తప్పు చేసిన వారిని శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం విజయనగరం జిల్లా హగరి బొమ్మనహళ్లిలో జేడియస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బళ్లారి(కర్ణాటక): సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షల్లో తప్పు చేసిన వారిని శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం విజయనగరం జిల్లా హగరి బొమ్మనహళ్లిలో జేడియస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా జలధార యాత్రలో పాల్గొనే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. నిజాయితీగా పరీక్షలు రాసిన విద్యార్థులు చేసిన తప్పు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారని, పరీక్షల్లో ఎవరు ఉత్తీర్ణులయ్యారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. విచారణ నివేదిక రాకముందే నియామకాల్ని రద్దు చేయడం సరికాదన్నారు. నిజాయితీగా పరీక్షలు రాసిన వారి జీవితాలతో చెలగాటమాడడం తగదన్నారు. బెంగళూరులో యువతిపై యాసిడ్‌ దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-01T16:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising