ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tenders Corruption case: ఈపీఎస్‌ టెండర్ల అవినీతి కేసు 2కు విచారణ వాయిదా

ABN, First Publish Date - 2022-07-27T13:14:18+05:30

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై నమోదైన టెండర్ల కేటాయింపుల అవినీతి కేసు విచారణ సుప్రీంకోర్టు ఆగస్టు రెండోతేదీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై నమోదైన టెండర్ల కేటాయింపుల అవినీతి కేసు విచారణ సుప్రీంకోర్టు ఆగస్టు రెండోతేదీకి వాయిదా వేసింది. ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి టెండర్ల కేటాయింపుల్లో రూ.4800 కోట్ల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ డీఎంకే(Dmk) ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఒట్టాన్‌సత్తిరం - తారాపురం- అవినాశి పాళయం ఫోర్‌వే రహదారి పథకానికి మొదట రూ.713.34 కోట్లతో ప్రణాళిక రూపొందించి, ఆ తర్వాత వ్యయాన్ని రూ.1515 కోట్లకు పెంచి ఆ టెండర్‌ను ఈపీఎస్‌ తన బంధువైన రామలింగానికి కేటాయించారని, ఇదే విధంగా వెంకటాచలపతి అండ్‌ కో అనే సంస్థకు కూడా మరికొన్ని రహదారుల టెండర్లను అంచనా వ్యయాన్ని అధికం చేసి అవినీతికి పాల్పడ్డారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఆ పిటిషన్‌పై 2018లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి(Madras High Court Judge) జగదీశ్‌చంద్ర విచారణ జరిపి కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని తీర్పునిచ్చారు. దానిని సవాలు చేస్తూ ఈపీఎస్‌ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఆ అప్పీల్‌ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  నాలుగేళ్లుగా ఆ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఆ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలంటూ ఏసీబీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం విచారణ ప్రారంభించింది.  ఈ కేసులో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను మార్చుకోవాలని పిటిషనర్‌ భావిస్తున్నందున విచారణ వాయిదా వేయాలని ఆర్‌ఎస్‌ భారతి తరఫున హాజరైన న్యాయవాది  కోరారు. ఈపీఎస్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు విచారణ మంగళవారం జరుగుతుందని తమకు ముందస్తు సమాచారం సకాలంలో అందకపోవటంతో సిద్ధంగా లేమని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇరువైపు న్యాయవాదుల విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం తదుపరి విచారణకు మూడువారాల గడువు ఇవ్వలేమని, ఆగస్టు రెండుకు విచారణను వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-07-27T13:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising