ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపేక్షిస్తే ఉపద్రవం

ABN, First Publish Date - 2022-04-14T12:53:01+05:30

కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో దేశంలో పౌరులు స్వాతంత్య్రం కోల్పో తున్నారని, ఇదిలాగే కొనసాగితే ఏదో ఒకరోజు ప్రజలు తమ స్వేచ్ఛను పూర్తిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మన స్వేచ్ఛ హరించుకుపోవడం ఖాయం

- కేంద్రం నిర్ణయాలన్నీ రాజ్యాంగ వ్యతిరేకమే

- కేంద్ర మాజీమంత్రి చిదంబరం ధ్వజం

- తిరుచ్చిలో ఉప్పుసత్యాగ్రహ స్మారక యాత్ర ప్రారంభం


చెన్నై: కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో దేశంలో పౌరులు స్వాతంత్య్రం కోల్పో తున్నారని, ఇదిలాగే కొనసాగితే ఏదో ఒకరోజు ప్రజలు తమ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోవడం ఖాయమని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. ప్రజలు ఈ వ్యవహారాన్ని ఉపేక్షించకుండా అప్రమత్తం కావాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. తిరుచ్చిలో బుధవారం ఉప్పు సత్యాగ్రహ స్మారక యాత్రను ప్రారంభించిన చిదంబరం మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు మనకిష్టమైన భాష, ఆహారం, శైలి, సంస్కృతిని అనుసరించే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. వాక్‌ స్వాతంత్య్రం, స్వేచ్ఛ క్రమేణా హరించబడుతోందన్నారు. రాజ్యాంగంలో జోక్యం చేసుకునే హక్కు పాలకులకు పరిమితంగా వుంటుందని, కానీ కేంద్రపాలకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ, తమకనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే ప్రతి పౌరుడూ వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం ఖాయమని,  ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జవహర్‌లాల్‌ నెహ్రూ కీలక పాత్ర పోషించారని, కానీ నేటి పాలకులు చరిత్రపుటల్లో ఆయన అధ్యాయాన్ని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి మాట్లాడుతూ.. కేంద్ర విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని, ఆ మేరకు తమ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెంచితేనే నానా యాగీ చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రతిరోజూ పెట్రోల్‌ ధరలు పెంచుతున్నాయని, బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ కలిసి దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని ఆరోపించారు. ఇదిలా వుండగా ఈ ఉప్పుసత్యాగ్రహ స్మారక యాత్రకు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు నేతృత్వం వహించగా, వందలాదిమంది కార్యకర్తలు, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-14T12:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising