ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ ఇంగ్లీషు ప్రొఫెషనల్సే.. కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు!

ABN, First Publish Date - 2022-08-04T11:02:54+05:30

గుజరాత్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష రాసి మంచి మార్కులు సాధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, ఆగస్టు 3: గుజరాత్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష రాసి మంచి మార్కులు సాధించారు. ఆ స్కోరుతో కెనడాలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ పొందారు. కానీ, అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని ఇంగ్లిషులో కనీసం ఒక్క ముక్కైనా మాట్లాడలేక జడ్జి ముందు తెల్లమొహం వేశారు. దీంతో కోర్టు.. ఓ హిందీ అనువాదకుడి సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఆ విద్యార్థులు సాధించిన మార్కుల గురించి తెలుసుకున్న జడ్జి.. తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం దీనిపై విచారణ జరిపించాల్సిందిగా గుజరాత్‌ పోలీసులకు సూచించారు. విద్యార్థులంతా 19-21 మధ్య వయస్కులని, దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో గత ఏడాది సెప్టెంబరు 25న ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష రాశారని గుజరాత్‌ పోలీసులు తెలిపారు. ఆ పరీక్ష సమయంలో ఆ కేంద్రంలోని సీసీటీవీలు అన్నింటినీ స్విచాఫ్‌ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, పరీక్ష నిర్వాహకులకు నోటీసులు పంపించామని తెలిపారు.  

Updated Date - 2022-08-04T11:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising