ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అణుక్షణం ఉత్కంఠ

ABN, First Publish Date - 2022-03-05T06:58:27+05:30

అణు భయంతో ఐరోపా దేశాలు గజగజా వణికిపోయాయి. ఉక్రెయిన్‌లోని ఎనెర్హొదార్‌ నగరంలో ఉన్న జాపొరీజియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా బాంబు దాడులతో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాపొరీజియా ప్లాంట్‌పై రష్యా షెల్స్‌!

తొలుత రియాక్టర్‌పై దాడి అంటూ వార్తలు

కాంటాక్ట్‌లోకి రాని ప్లాంట్‌ అధికారులు

మూడు గంటల పాటు అంతటా టెన్షన్‌టెన్షన్‌

ప్రపంచ షేర్‌ మార్కెట్లన్నీ ఢమాల్‌

ఆ తర్వాత మీడియా ముందుకు ప్లాంట్‌ డీజీ

పరిపాలన భవనంపై బాంబింగ్‌ అంటూ వెల్లడి

ఉపయోగంలో లేని అణు రియాక్టర్‌కు మంటలు

ఊపిరి పీల్చుకున్న ఐరోపా దేశాలు.. ప్రపంచం

రంగంలోకి అంతర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ

ఉక్రెయినే షెల్స్‌ వేసి నెపం మాపై వేస్తోంది: రష్యా

ఆ వెంటనే.. ప్లాంట్‌ ఆధీనంలోకి వచ్చిందన్న రష్యా

కాదు.. ‘కాదిరోవ్‌’ మిలిటెంట్ల వశమైంది: ఉక్రెయిన్‌

ఖండించిన ప్రపంచం.. జెలెన్‌స్కీకి బైడెన్‌ ఫోన్‌

ఆహారం, ఆశ్రయం ఇచ్చింది మేమే

మీ విద్యార్థులకు చెప్పండి

జ్యోతిరాదిత్యకు బుకారెస్ట్‌ మేయర్‌ సూచన

విద్యార్థుల తరలింపుపై ప్రచారం దారుణం: కేటీఆర్‌


కీవ్‌, మార్చి 4: అణు భయంతో ఐరోపా దేశాలు గజగజా వణికిపోయాయి. ఉక్రెయిన్‌లోని ఎనెర్హొదార్‌ నగరంలో ఉన్న జాపొరీజియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా బాంబు దాడులతో యావత్‌ ప్రపంచం దద్దరిల్లిపోయింది. ‘అణు’క్షణం ఏమవుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఐరోపా దేశాలు అణుధార్మికత(రేడియేషన్‌) భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపాయి. 1986 నాటి చెర్నోబిల్‌(ఉక్రెయిన్‌), 2011 నాటి పుకుషిమా(జపాన్‌) ప్రమాదాల కంటే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన జాపొరీజియా ప్లాంట్‌లో రేడియేషన్‌ 10 రెట్లు అధికంగా వెలువడే ప్రమాదం ఉండడంతో.. ఆయా దేశాలు కకావికలమయ్యాయి.


శుక్రవారం తెల్లవారుజామున జాపొరీజియా అణు విద్యుత్తు కేంద్రంపై మిసైల్స్‌, రాకెట్‌ లాంచర్లతో దాడులు జరిగాయి. వెనువెంటనే మంటలు కమ్ముకున్నాయి. ఆ ప్రాంతాన్ని కమ్ముకున్న దట్టమైన నల్లటి పొగ కొన్ని కిలోమీటర్ల వరకు కనిపించింది. ఆ పొగను చూసిన పౌరులు ‘రేడియేషన్‌ భూ తం’ వచ్చేస్తోందంటూ ఉరుకులు పరుగులు పెట్టారు. ఉదయం 6 గంటలకు ఎనెర్హొదార్‌ నగర మేయర్‌ దిమిత్రో ఓర్లోవ్‌ ఈ విషయాన్ని టెలిగ్రామ్‌ చానల్‌ ద్వారా ప్రకటించారు. బాంబు దాడులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అణు నిల్వల కంటైనర్లు బారులుతీరి ఉన్నాయని, మంటలు వాటిదాకా విస్తరిస్తే పరిస్థితి మరింత విషమిస్తుందనడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ వార్తల ప్రభావంతో భారత్‌ సహా ఆసియా దేశాల మార్కెట్లు టపీమని పడిపోయా యి. అణు విద్యుత్తు కేంద్రంలోని సిబ్బంది, అధికారులతో కాంటాక్టులు కట్‌ అవ్వడంతో 3 గంటల పాటు ఏం జరుగుతోందో తెలియక అంతటా భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత జాపొరీజియా అణు విద్యుత్తు కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ ఆండ్రీ తుజ్‌ కాంటాక్ట్‌లోకి వచ్చారు. అణు విద్యుత్తు కేంద్రం పరిపాలన భవనంలోని ఓ శిక్షణ కేంద్రంపై బాంబులు పడ్డాయని వెల్లడించారు. దానికి సమీపంలోని ఓ రియాక్టర్‌కు మంటలంటుకున్నాయని, అయితే దాన్ని చాలాకాలంగా వినియోగించడం లేదని వివరించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది.


ఆ పవర్‌ప్లాంట్‌ ప్రస్తుతం తమ ఆధీనంలో ఉందని రష్యా వర్గాలు ప్రకటించగా.. చెచెన్‌కు చెందిన ‘కాదిరోవ్‌’ మిలిటెంట్ల గ్రూపు అణు విద్యుత్తు కేంద్రాన్ని హస్తగతం చేసుకుందని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. భయపడినట్లే శుక్రవారం ఉదయం జాపొరీజియా ప్లాంట్‌పై బాంబు దాడులు జరిగాయి. 


ఎదురొడ్డిన ఎనెర్హొదార్‌ ప్రజలు

నిజానికి రష్యా 100 మంది సైనికులతో గురువారమే జాపొరీజియా ప్లాం ట్‌ స్వాధీనానికి ప్రయత్నించింది. అయితే.. ఎనెర్హోదర్‌ ప్రజలు ఆ సేనలను కట్టడి చేశారు. 22 వేల మంది మానవహారంగా నిలబడ్డారు. సాయంత్రం దాకా రష్యా సేనలు వాటిని దాటలేకపోయాయి. సాయంత్రం కాల్పులకు కూడా దిగాయి. దీంతో పౌరులు చెల్లాచెదురైనా రష్యా సేనలకు దారివ్వలేదు. రాత్రికి సేనలు వెనక్కి తగ్గడంతో పౌరులు ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయా రు. ఉదయం తిరిగి మానవహారం కార్యక్రమం ఉండడంతో రష్యా సేనలు తెల్లవారుజామునే జాపొరీజియా వైపు సాగాయి. తెల్లవారుజామున ప్లాంట్‌ పై షెల్స్‌ ప్రయోగించాయి. దీంతో జాపొరీజియా అణువిద్యుత్తు కేంద్రం పరిపాలన భవనానికి మంటలంటుకున్నాయి. అణు రియాక్టర్లు పేలుడు జరిగిన ప్రదేశానికి దూరంలో ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే.. ఈ ఘటనలో ముగ్గురు ఉక్రెయిన్‌ సైనికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని ఆరు అణురియాక్టర్లను ఇప్పటికే షట్‌డౌన్‌ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అయితే.. ప్రమాదం తొలగిపోలేదని, అణు రియాక్టర్లలోని శీతలీకరణ వ్యవస్థ దెబ్బతింటే రేడియేషన్‌ ముప్పు తీవ్రంగా ఉంటుందని భారత అణు ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త అమోల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. జాపొరీజియా ప్లాంట్‌పై దాడి జరిగితే.. చర్నోబిల్‌ ప్రమాదం కంటే 10 రెట్లు అధిక రేడియేషన్‌ విడుదల అవుతుందని ఆందోళన చెందారు.


రంగంలోకి అంతర్జాతీయ సంస్థలు

జాపొరీజియా ప్రమాదం వార్త తెలియగానే.. అంతర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ(ఐఏఈఏ), అమెరికా అణు ప్రమాదాల ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. ఒకవేళ రేడియేషన్‌ వెలువడితే.. దాన్ని ఎలా నిరోధించాలనే అంశాలపై అమెరికా బృందం ఉక్రెయిన్‌కు సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ మారియానో గ్రోసీ మీడియాతో మాట్లాడుతూ.. జాపొరీజియా ప్లాంట్‌లో అణు రియాక్టర్లకు నష్టం వాటిల్లలేదని ప్రకటించారు. కేవలం పరిపాలన భవనంలోని శిక్షణ కేంద్రమే బాంబుదాడికి గురైందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్లాంట్‌లోని రియాక్టర్లను ఇప్పటికే షట్‌డౌన్‌ చేశారని వివరించారు. అటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్లో మాట్లాడారు.


జాపొరీజియా ప్లాంట్‌పై దాడి వివరాలను తెలుసుకున్నారు. జాపొరీజియాలో రేడియో ధార్మికత మునుపటిలాగే ఉందని.. దాని స్థాయులు పెరగలేదని అమెరికా అణుశాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఘటనను ప్రపంచదేశాలు ఖండించాయి.  జాపొరీజియా అణువిద్యుత్తు కేంద్రంపై తాము దాడి చేయలేదని రష్యా పేర్కొంది. ఉక్రెయినే వ్యూహాత్మకంగా దాడి చేసి, తమపై నెపాన్ని తోస్తోందని ఆరోపించింది. ఆధారాల్లేకుండా తమపై ఆరోపణలు మోపడంపై ఆక్షేపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే జాపొరీజియా ప్లాంట్‌ తమ ఆధీనంలోకి వచ్చినట్లు రష్యా వర్గాలు ప్రకటించడం గమనార్హం. కాగా.. అంతర్జాతీయంగా ఆంక్షలు పెరగడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు ఏపీఈసీ చమురు సరఫరా దేశాల సమాఖ్యను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఇరువురి ఫోన్‌కాల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థపై దాడి చేసింది. ఆ తర్వాత మిలటరీ బేస్‌లు, కార్యాలయాలపై బాంబుల వర్షం కురిపించింది. రవాణా, విద్యుత్తు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. జాపొరీజియానూ హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఒకిర్కాలోని విద్యుత్తు కేంద్రాన్ని ధ్వంసం చేసింది. రష్యా సేనలు మైకొలైవ్‌ రీజియన్‌లోని దక్షిణ ఉక్రెయిన్‌ అణువిద్యుత్తు కేంద్రం దిశగా కదులుతుండడంపై ఉక్రెయిన్‌ ఆందోళన చెందుతోంది. కాగా, కీవ్‌నగర సమీపంలోని గ్రామాలే టార్గెట్‌గా రష్యా వైమానిక దాడులు రెండోరోజూ కొనసాగాయి. బాంబుల వర్షంతో బోరోడియాంక గ్రామంలో భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద 100 మంది ఉంటారని ఎమర్జెన్సీ సేవల అధికారి వెల్లడించారు. మరో గ్రామంలో జరిగిన బాంబుదాడుల్లో ఇద్దరు పౌరులు, ముగ్గురు చిన్నారులు మరణించారు.


Updated Date - 2022-03-05T06:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising