ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Judgment: అన్నాడీఎంకే సర్వసభ్యమండలి కేసులో నేడు తీర్పు?

ABN, First Publish Date - 2022-08-16T14:34:28+05:30

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) అధ్యక్షతన గత జూలై 11న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) అధ్యక్షతన గత జూలై 11న జరిపిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదంటూ ప్రకటించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (OPS) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పువెలువరించనుంది. పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా ఆ సమావేశం జరిగిందంటూ ఓపీఎస్‌ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించినప్పుడు ఈ వివాదంపై హైకోర్టును ఆశ్రయించాలని ఓపీఎస్ కు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్‌(Jayachandran) పిటిషన్‌పై విచారణ జరిపి ఇరుపక్షాల వాద ప్రతివాదనలు ముగిసిన తర్వాత తీర్పును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడుతుందని ఈపీఎస్‌, ఓపీఎస్‌(EPS, OPS) వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇదివరకే సర్వసభ్యమండలి సమావేశం పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ వివాదంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణన్‌రామసామిలాగే తమకు సానుకూలంగా మంగళవారం తీర్పు వెలువడుతుందని ఈపీఎస్‌ వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-16T14:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising