ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EPS: ఆత్మస్తుతి.. పరనింద

ABN, First Publish Date - 2022-12-16T08:58:47+05:30

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇంతకంటే సీఎం సాధించిందేమీ లేదు

- ఈపీఎస్‌ ధ్వజం

అడయార్‌(చెన్నై), డిసెంబరు 15: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఆరోపించారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌.. రాష్ట్రంలో వరుస హత్యలు, లాకప్‌ డెత్‌లు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వ్యవహారమంతా ఆత్మస్తుతి, పరనిందలా వుందని, ఇంతకు మించి ఆయన సాధించిందేమీ లేదని విమర్శించారు. ఇదే విషయంపై ఆయన గురువారం ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. గత 19 నెలలుగా డీఎంకే ప్రభుత్వ వేధింపులు భరించలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఇవేమీ పట్టించుకోని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin).. పుదుచ్చేరిలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై ప్రసంగిస్తూ, ప్రజలు తనను, తన పాలనను ప్రశంసిస్తున్నట్టుగా తనకు తానే చెప్పుకున్నారన్నారు. ఆయన నోటి నుంచి జాలువారిన ఆత్మస్తుతి తర్వాత రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరిగాయని వరుసబెట్టి గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పైగా ఈ కేసుల్లో పట్టుబడుతున్న వారంతా డీఎంకేకు చెందినవారేనన్నారు. హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం స్టాలిన్‌ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సి వుందని, అయితే ఆయన మాత్రం చోద్యం చూస్తున్నారని ఎడప్పాడి దుయ్యబట్టారు.

Updated Date - 2022-12-16T09:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising