ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్మింగ్ హామ్ టీ 20లో టీమిండియా ఘన విజయం

ABN, First Publish Date - 2022-07-10T04:00:51+05:30

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలిచింది. 17 ఓవర్లలో 121 పరుగుల చేసిన ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 3 టీ ట్వంటీల సిరీస్‌లో టీమిండియా.. 2 మ్యాచ్‌లు గెలిచి కప్‌ను సొంతం  చేసుకుంది. మిగిలిన మరో మ్యాచ్‌ నాటింగ్‌హామ్‌లో జరగనుంది. 


ఇంగ్లండ్ స్కోర్:121/10, ఇండియా స్కోర్: 170/8


తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ సేనకు ఆరంభం బాగున్నా ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 49 పరుగుల వద్ద రోహిత్ శర్మ (31) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్‌.. 61 పరుగుల వద్ద కోహ్లీ (1), రిషభ్ పంత్ (26) వికెట్లను కోల్పోయింది.


ఆ తర్వాత కూడా వరుస షాకులు తగిలాయి. అయితే, రవీంద్ర జడేజా క్రీజులో కుదురుకోవడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. 29 బంతులు ఎదుర్కొన్న జడేజా 5 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 15, పాండ్యా 12, కార్తీక్ 12, హర్షల్ పటేల్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, రిచర్డ్ గ్లీసన్‌ 3 వికెట్లు తీసుకున్నారు.


ఇక 170 పరుగుల టార్గెట్ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ వరుస వికెట్లు కోల్పోయింది. ఫలితంగా మ్యాచ్ ఓడిపోయింది. మొయిన్ అలీ 35, డేవిడ్ విల్లే 33 పరుగులు చేశారు. మిగిలిన వారెవరూ కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. 

Updated Date - 2022-07-10T04:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising