ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Enforcement Directorate : మహారాష్ట్ర మంత్రి అనిల్ ఇంట్లో ఈడీ సోదాలు

ABN, First Publish Date - 2022-05-26T16:20:36+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) సన్నిహితుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ (Anil Parab) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు చేసింది. డపోలీ సిటీలోని ఆయన ఇంటితోపాటు ముంబై, పుణేలలోని మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసింది.


అనిల్ పరబ్ మహారాష్ట్ర (Maharashtra) రవాణా శాఖ మంత్రి. ఆయన శివసేన (ShivSena) నేత. ఆయనకు డపోలీ సిటీలో ఓ రిసార్ట్ ఉంది. ఇక్కడి భూమిని 2017లో కొన్నపుడు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.  మొత్తం మీద ఏడు చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. 


మహారాష్ట్రకు చెందిన మరో మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik) ఫిబ్రవరిలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆయనకు దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం మాలిక్ జైలులో ఉన్నారు. 


శివసే, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీపై ఈ కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది. 


Updated Date - 2022-05-26T16:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising