ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ED seals National Herald office: హుటాహుటిన ఢిల్లీకి పయనమైన రాహుల్

ABN, First Publish Date - 2022-08-04T01:43:15+05:30

బెంగళూరు: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ( National Herald) కార్యాలయం సమీపంలోని యంగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ( National Herald) కార్యాలయం సమీపంలోని యంగ్ ఇండియన్ (Young Indian Office) కార్యాలయాన్ని సీజ్ చేయడంతో కర్ణాటక పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హుటాహుటిన రాజధానికి పయనమయ్యారు. రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కర్ణాటక హుబ్లీ నుంచి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకరిద్దరు వ్యాపార దిగ్గజాల కోసం మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులను పట్టించుకోవడం లేదన్నారు.






మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ నివాసాల వద్ద భద్రతను పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అటు మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం ఇప్పటికే రాహుల్ నివాసానికి చేరుకున్నారు. 


మరోవైపు ఈడీ అధికారులు యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్ చేశాక కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ, అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని ఇంటిని కూడా ముట్టడిస్తామన్నారు. 

Updated Date - 2022-08-04T01:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising