ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రంతా మంచులో చిక్కుకుపోయి 8 మంది పర్యాటకుల మృతి.. ముర్రీలో ఎమర్జెన్సీ!

ABN, First Publish Date - 2022-01-08T21:50:55+05:30

పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రీలో 8 మంది పర్యాటకులు మృతి చెందారు. వారి వాహనాలు రాత్రంతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రీలో 8 మంది పర్యాటకులు మృతి చెందారు. వారి వాహనాలు రాత్రంతా మంచులో చిక్కుకుపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మంచులో వాహనాలు పూర్తిగా కప్పబడిపోవడంతో లోపల ఉన్న వారంతా ఊపిరి ఆడక చనిపోయారు. భారీగా కురుస్తున్న మంచుతో ముర్రీలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం ముర్రీలో ఎమర్జెన్సీ ప్రకటించింది.


ముర్రీకి వెళ్లే అన్ని రహదారులను మూసివేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు ఈశాన్యంగా దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీకి ప్రతి ఏడాది శీతాకాలంలో వేలాదిమంది పర్యాటకులు పోటెత్తుతుంటారు. కురుస్తున్న మంచును చూసి తన్మయత్వం చెందుతారు. ఇప్పుడు అదే మంచు 8 మంది ప్రాణాలను బలిగొంది. 

Updated Date - 2022-01-08T21:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising