ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashmirలో వచ్చే నాలుగైదేళ్లలో అందరికీ ఉచితంగా విద్యుత్

ABN, First Publish Date - 2022-04-14T16:57:30+05:30

ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి Jitendra Singh వెల్లడి

న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్లలో జమ్మూ కశ్మీర్‌లో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తును అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు.ఈ నెలలో కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం భద్రత,ఇతర సంసిద్ధతను సమీక్షించడానికి కశ్మీర్ వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గందరగోళం నుంచి జమ్మూ కశ్మీర్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.‘‘మేం కశ్మీర్ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధిలో కొత్త ఆవిష్కరణలు చేస్తామని, వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు.కశ్మీరులో రూ. 2.45 కోట్ల విలువైన సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసే పని రెండు రోజుల్లో పూర్తవుతుందని, దీని ద్వారా ఏప్రిల్ 18 వతేదీ నాటికి 340 గృహాలకు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు.2019 ఆగస్టులో కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 


Updated Date - 2022-04-14T16:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising