ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలపై Congress కసరత్తు

ABN, First Publish Date - 2022-02-27T19:02:01+05:30

శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు రానున్నాయనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈదిశగానే సంకేతాలు పంపినట్లు సమాచారం. శాసనసభకు 2023 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగానే ఎన్నికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముఖ్యనాయకులకు అధిష్ఠానం దిశానిర్దేశం

- కలసి సాగాలని హితవు


బెంగళూరు: శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు రానున్నాయనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈదిశగానే సంకేతాలు పంపినట్లు సమాచారం. శాసనసభకు 2023 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఆ మేరకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం సజావుగానే సాగుతోంది. అంతర్గత విభేదాలు కానీ ఇతరత్రా కుట్రలు అంతకుమించి ముఖ్యమంత్రి కావాలనుకునేవారి ఎత్తుగడలు కూడా సాగడం లేదు. ప్రస్తుతం ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సంకేతాలు అందుతున్నాయి. కర్ణాటకలో ముందస్తుగా ఎన్నికలు రానున్నాయనే చర్చలు హస్తినలోనూ సాగుతున్నాయి. ఇదే కారణంతోనే కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన 15 మంది ముఖ్యనాయకులను ఢిల్లీకి పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఇదే ఉత్సాహం కొనసాగాలని పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన 15 మంది నాయకుల సమావేశంలో పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాత్రమే ఉన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్‌ విషయంలో ఆచితూచి స్పందించిన తీరుతో పాటు కావేరీ నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టు నిర్మించే విషయమై పాదయాత్ర విజయవంతం కావడం, జాతీయజెండాను రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప అవమానించారని శాసనసభలను స్తంభింపచేయడం తెలిసిందే. శాసనసభ కలాపాలు సాగకుండా అడ్డుకోవడమే కాకుండా ఏకంగా నాలుగురోజుల ముందుగానే వాయిదా పడేలా చేయడం ద్వారా పార్టీ ప్రభుత్వంపై పట్టుసాధించిందనే సంతోషంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇదే ఉత్సాహం మరో 10నెలల పాటు కొనసాగించేందుకు దిశానిర్దేశం చేయడంతో పాటు ముందస్తు ఎన్నికలు రావచ్చునని అందుకోసం అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ముఖ్యనేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య అంతర్గత విభేధాలపైనా సున్నితంగానే మందలించినట్లు సమాచారం. ఇలా రాష్ట్రనేతలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.


రెండు జాతీయ పార్టీలకు ప్రాధాన్యత 

రాష్ట్రంలో 2018లో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి అత్యధిక మెజారిటీ వచ్చి నా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. ఇదే సందర్భంలోనే కాంగ్రెస్‌ పార్టీ జేడీఎ్‌సతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికి అప్పగించింది. 18 నెలల పాటు ప్రభుత్వం సాగగా 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో శాసనసభలో మెజారిటీ కోల్పోవడంతో బీజేపీకి అవకాశం దక్కింది. ఇలా ముఖ్యమంత్రి పీఠమెక్కిన యడియూరప్ప రెండేళ్లపాటు పాలనసాగించారు. అధిష్ఠానం సూచనల మేరకు రాజీనామా చేయడంతో బసవరాజ్‌బొమ్మై సీఎం అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టి ఐదునెలలవుతోంది. ప్రస్తుతానికి భారీ మార్పులు లేకున్నా ఏడాదిలో ఎన్నికలు వస్తున్నందున క్రియాశీలకంగాలేని కొందరు మంత్రులను తప్పించి ఉత్సాహం, పార్టీపట్ల అంకిత భావం కలిగిన వారిని మంత్రులు చేయాలనే ప్రతిపాదన సాగుతోంది. అందుకు సిద్ధమైన అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలు బెంగళూరు పర్యటనను ఖరారు చేసుకోగా ఐదురాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో బ్రేక్‌ పడింది. మరో కొన్నిరోజులలోనే ఐదురాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందులో ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా ఉంటే ముందుగానే అంటే ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు మెండు అనిపిస్తోంది. అందుకు ముఖ్యకారణం రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని చేజారకుండా కాపాడుకుంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు సులభంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దక్షిణభారత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు అనుకూలమైనది కేవలం కర్ణాటక మాత్రమే కావడంతో అగ్రనేతలు రాష్ట్రంపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.

Updated Date - 2022-02-27T19:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising